తమన్నాకి కలిసొచ్చింది

Tuesday,October 01,2019 - 09:02 by Z_CLU

మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా’. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నయనతార.. తమన్నా. సినిమాలో చిరు భార్యగా నయన్ నటిస్తే.. తమన్నా కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ రోల్ ప్లే చేసింది. అయితే ఓవరాల్ గా హీరోయిన్ క్రెడిట్స్ మాత్రం స్ట్రేట్ గా తమన్నాకే దక్కుతున్నాయి. దానికి రీజన్ ఉంది.

రెగ్యులర్ సినిమాల్లోలా జస్ట్ గ్లామర్ షో కోసం అన్నట్టుగా కాకుండా, వీళ్ళిద్దరూ ప్లే చేసినవి చాలా స్ట్రాంగ్ రోల్స్. ఆ వేరియేషన్స్ ట్రైలర్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ప్రమోషన్స్ లోనే తమన్నా తప్ప నయనతార ఎక్కడా కన్పించట్లేదు. దాంతో తమన్నా మరింత ఫోకస్ లోకి వస్తుంది.

డేట్స్ కుదరకపోవడంతో నయన్ కంప్లీట్ గా సైరా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. ఇక తమన్నా సైరా ప్రమోషన్స్ లో ప్రతి స్టేట్ కి సినిమా యూనిట్ తో పాటు తిరిగి, సైరా ఎక్స్ పీరియన్స్ ని, ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ, సినిమా చుట్టూ మరింత క్యూరియాసిటీని జెనెరేట్ చేస్తుంది, దాంతో మేకర్స్ కూడా తమన్నాకి సినిమా పట్ల ఉన్న డెడికేషన్ ని, పొగిడిన చోట పొగడకుండా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఒక్క ‘సైరా’ విషయంలోనే కాదు… తమన్నా ఏ సినిమాకి పని చేసినా, ప్రమోషన్స్ విషయంలో 100% సహకరిస్తుంది. ఇప్పుడు ‘సైరా’ విషయానికి వచ్చేసరికి తమన్నాకి ఉండే ఇదే డెడికేషన్ తనని మరింత స్పాట్ లైట్ లోకి తీసుకువస్తుంది.