సెంథిల్ కుమార్ కి ప్రముఖుల అభినందనలు

Wednesday,May 03,2017 - 06:47 by Z_CLU

దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి2 సంచలన విజయాన్ని సాధిస్తున్న విషయం అందరికి తెలిసిందే…కాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహించిన కెమెరామెన్ సెంథిల్ కుమార్, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు ఒక స్పెషల్ షో వేశారు. అన్నపూర్ణా స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేసిన ఈ స్పెషల్ షోకి ఎమ్ వీ రఘు, జయరామ్, జ్ఞాన సాగర్, టీజీ విందా, శివ వంటి ప్రముఖ ఛాయాగ్రహకులు హాజరై సెంథిల్ కుమార్ ని అభినందనలతో ముంచెత్తారు. భారత దేశం గర్వించదగిన ప్రతిష్టాత్మక చిత్రానికి సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఓ స్పెషల్ హైలెట్ గా నిలుస్తుందని వాళ్లు అభినందించారు.