ఆన్ లైన్ లో 'రాధా' పాటల సందడి

Wednesday,May 03,2017 - 07:10 by Z_CLU

శ‌త‌మానం భ‌వ‌తి గ్రాండ్ హిట్ తర్వాత శర్వానంద్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాతగా చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధ‌’..


ఇటీవలే టీజర్ తో సోషల్ మీడియా హంగామా చేసిన ఈ సినిమా ప్రెజెంట్ పాటలు తో హంగామా చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.. రధన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను ఇటీవలే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా అన్ని పాటలలతో కూడిన ఆల్బమ్ ను ఆన్లైన్ లో రిలీజ్ చేశారు.. ప్రెజెంట్ షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తూ సినిమాను మే 12 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..