బోయపాటి హంసలదీవి షెడ్యూల్ కి ప్యాకప్

Wednesday,May 03,2017 - 06:11 by Z_CLU

బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా హంసలదీవి లో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, వాణి విశ్వనాథ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

లాస్ట్ షెడ్యూల్ లో హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ హీరో ఇమేజ్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు సినిమా యూనిట్.