సెంథిల్ కుమార్ ఇంటర్వ్యూ

Thursday,July 05,2018 - 06:07 by Z_CLU

కళ్యాణ్ దేవ్ ‘విజేత’ ఈ నెల 12 న రిలీజవుతుంది. ‘బాహుబలి’ తరవాత సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ సినిమాకి పని చేశాడు. ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో చాలా కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయంటున్న సెంథిల్, ఈ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

 

ఈ సినిమా వేరు….

కొన్ని సినిమాలు చూసి మనం మెస్మరైజ్ అవుతుంటాం… ముఖ్యంగా సూపర్ హీరో లాంటి సినిమాలు.. అలా మనం చేయలేం కాబట్టి చూసి ఎంజాయ్ చేస్తుంటాం.. కానీ కొన్ని సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి… విజేత అలాంటిదే.. సినిమాలో ప్రతి క్యారెక్టర్ తో మనం కనెక్ట్ అవుతాం.

కనెక్టింగ్ పాయింట్ ఉండాలి…

గోల్కొండ  హైస్కూల్  సినిమా చేసినప్పుడు స్టోరీ చెప్పగానే కనెక్ట్ అయిపోయాను… అందునా నాకు క్రికెట్ అంటే ఇష్టం… ఈజీగా కనెక్ట్ అయిపోయా.. అలా మనం విన్న స్టోరీలో ఒక్క కనెక్టింగ్ పాయింట్ ఉన్నా చాలు…

నేను కిందికి వచ్చేశా…

బాహుబలి ఎక్స్ పీరియన్స్ వేరు.. ఆ లగ్జరీ వేరు… కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి అండర్ బడ్జెట్ చేయాలి.  బాహుబలి నన్ను ఎక్కడో నిలేబెట్టింది… నాక్కూడా అక్కడే ఉంటే బావుందనిపించింది కానీ ఉండలేం… అందుకే ఈ సినిమాతో కిందికి వచ్చేశా.. బ్యాక్ టు నార్మల్…

దేనికదే స్పెషల్…

ప్రతి సినిమా దేనికదే స్పెషల్… సినిమా అంటేనే విజువల్ గా కథను చెప్పడం… ఈ సినిమాకి కూడా ప్రతి సినిమా లాగే కష్టపడ్డాను…

క్లారిటీ కంపల్సరీ…

డైరెక్టర్ ఒక పర్టికులర్ సీన్ ప్లాన్ చేసినప్పుడు ఆ సీన్ విషయంలో కంప్లీట్ గా క్లారిటీ ఉండాలి.  రాకేశ్ కి ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి పాయింట్ చాలా క్లియర్ గా ఉన్నాడు. అందుకే అందరి పని ఈజీ అయిపోయింది.

బాలీవుడ్ ఆలోచన అవసరం లేదు…

టాలీవుడ్ లో బాహుబలి లాంటి సినిమాలు చేస్తూ కూడా బాలీవుడ్ కి వెళ్ళాలి అనే ఆలోచన అసలు అవసరం లేదు. ఒకవేళ మంచి ఆఫర్ వచ్చి కథ నచ్చి చేస్తే బాలీవుడ్ సినిమా చేస్తానేమో కానీ.. ఆ అవకాశం కోసం  డెస్పరేట్ గా వెయిట్ చేయడం లేదు.

కళ్యాణ్ దేవ్ గురించి…

ఫస్ట్ డే షూటింగ్ కి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు.. అంత కంఫర్టబుల్ గా లేడు… కానీ షూటింగ్ అయిపోయే నాటికి చాలా నేర్చుకున్నాడు… కోడి సాంగ్ లాస్ట్ లో షూట్ చేశాం.. అప్పటికీ తనలో చాలా ఈజ్ వచ్చేసింది… కళ్యాణ్ ప్రతీది చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటాడు…

త్వరలో ఆ రేంజ్…

లాస్ట్ ఇయర్ గమనిస్తే టాలీవుడ్ కి గోల్డెన్ ఏరా… అనే చెప్పాలి. ఇంకొన్ని రోజుల్లో ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే కనిపిస్తుంది… ఆ రేంజ్ త్వరలో వస్తుంది… టాలీవుడ్ లో అంత ట్యాలెంట్ ఉంది…

ఒకరోజులో జరిగే ప్రాసెస్ కాదు…

మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లోనే ఆ సినిమా చుట్టూ ఒక స్టైల్ క్రియేట్ అవుతుంది. స్టోరీ డిస్కస్ చేసేటప్పుడే, కెమెరా ని ఎలా ప్లాన్ చేసుకుంటే స్టోరీ కరెక్ట్ గా కన్వే అవుతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది.. అది అప్పటికప్పుడు సెట్స్ పై తీసుకునే డెసిషన్ కాదు…

ఆ ఆలోచన అయితే ఉంది…

ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలనే ఆలోచన ప్రతి టెక్నీషియన్ కి ఉంటుంది, నాక్కూడా ఉంది కాకపోతే ఇప్పుడే కాదు, దానికి చాలా టైమ్ ఉంది…

ఆయనపై గౌరవం ఇంకా పెరిగింది…

ఈ సినిమాలో మురళీ శర్మ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆయన మంచి యాక్టర్ అని ముందే తెలుసు కానీ, ఈ సినిమాలో ఆయన్ని చూసిన తరవాత ఆయనంటే నాకు మరింత గౌరవం పెరిగిపోయింది…