యాత్ర టీజర్ రెడీ.. స్పెషల్ డే ఫిక్స్

Thursday,July 05,2018 - 05:11 by Z_CLU

రీసెంట్ గా ప్రారంభమైంది సినిమా. లీడ్ రోల్ పోషిస్తున్న మమ్ముట్టి కూడా మొన్ననే సెట్స్ పైకి వచ్చారు. ఇంతలోనే టీజర్ రెడీ అయింది. అవును.. యాత్ర సినిమాకు సంబంధించి టీజర్ సిద్ధమైంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈనెల 8న యాత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

టీజర్ విడుదల చేయబోతున్నామనే విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన యూనిట్, ఈసారి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేశారు. ఇప్పటికే యాత్ర టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఈసారి కేవలం వైఎస్ మేనరిజమ్స్ కనిపించేలా మరో స్టిల్ రిలీజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ పాదయాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాదయాత్ర ద్వారానే వైఎస్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే యాత్ర సినిమాలో ఈ పాదయాత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈరోజు రిలీజ్ అయిన పిక్ కూడా అదే విషయాన్ని ఎలివేట్ చేస్తోంది.

70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహి వి.రాఘవ్ దర్శకుడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మోడ్ లో ఉన్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేయాలని నిర్ణయించారు.