ఒకరు దేవ.. ఇంకొకరు దాస్.. అదే దేవదాస్

Thursday,July 05,2018 - 06:38 by Z_CLU

నాగార్జున, నాని సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవదాస్ అనే పేరుపెట్టారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ క్లాసిక్ మూవీ దేవదాస్. ఆ టైటిల్ తో సినిమా చేద్దామని నాగార్జున చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకు దేవదాస్ టైటిల్ తో నాగార్జున సినిమా వస్తోంది.

ఈ టైటిల్ వెనక మరో గమ్మత్తయిన మేటర్ కూడా ఉంది. ఇది ఇద్దరు వ్యక్తుల పేర్ల కలయిక. సినిమాలో నాగార్జున దేవ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక నాని దాస్ పాత్రలో కనిపిస్తాడు. వీళ్లిద్దరి పేర్లను కలిపి దేవదాస్ అనే టైటిల్ ను సినిమాకు ఫిక్స్ చేశారట.

సినిమా థీమ్ ను కూడా టైటిల్ పోస్టర్ లో చూపించాడు. దేవదాస్ లో డాన్ పాత్రలో నాగార్జున కనిపిస్తాడు. డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. ఈ రెండు విషయాల్ని తెలుపుతూ ఓ తుపాకి, పాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను కూడా టైటిల్ పోస్టర్ లో చూపించారు.

ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే, దేవదాస్ షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. మూవీలో నాగార్జున సరసన మళ్లీ రావా ఫేం ఆకాంక్ష సింగ్, నాని సరసన ఛలో ఫేం రష్మిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.