ఒకే రోజు మెగా అల్లుళ్ళ హంగామా...

Thursday,June 14,2018 - 06:27 by Z_CLU

జూలై 6 న మెగా హంగామా బిగిన్ కానుంది. ఓ వైపు సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ I love u’ రిలీజవుతుంటే అదే రోజు, మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ రిలీజవుతుంది. దీంతో జూలై ఫస్ట్ వీకెండ్ మెగా వీకెండ్ కానుంది.

 

టాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తేజ్ I love u’ ఆడియో ఇప్పటికే సూపర్ హిట్టయింది. దానికి తోడు అగ్రెసివ్ గా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్  జూన్ 17 గ్రాండ్ గా ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ ని జరుపుకోనున్నారు.

 

రాకేశ్ శశి డైరెక్షన్ లో హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘విజేత’ చుట్టూ కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు ఈ నెల 24 న జరగనున్న ఆడియో ఈవెంట్ కి చిరంజీవి అటెండ్ అవుతున్నాడు. దీంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

గతంలోనూ సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాలు కూడా ఇలాగే పోటీ పడ్డాయి. ఆ తరవాత ఫిల్మ్ మేకర్స్  ఆ రెండు  సినిమాల మధ్య  ఒక్క రోజు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.