కళ్యాణ్ దేవ్ ‘విజేత’కి లైన్ క్లియర్

Friday,July 06,2018 - 05:09 by Z_CLU

 కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతున్న ‘విజేత’ సెన్సార్ క్లియరైంది. ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది. జూలై 12 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళీశర్మ, కళ్యాణ్ దేవ్ కి ఫాదర్ గా కనిపించనున్నాడు. మన వల్ల మరొకరి ఫేస్ లో చిన్న స్మైల్ తీసుకువచ్చినా, అది మన సక్సెసే… అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ హైలెట్ కానుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తే, కళ్యాణ్ దేవ్ మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి రాకేశ్ శశి డైరెక్టర్. సాయి కొర్రపాటి ఈ సినిమాని వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మించాడు.