ఈగ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మెగా హీరో

Wednesday,June 13,2018 - 03:30 by Z_CLU

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. విజేత సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజైంది. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ రెడీ అయింది. ఈగ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. జులై 6న విజేతను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

విజేత, ఈగ సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఆ సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ అవసరం నిర్మాత సాయి కొర్రపాటికి ఉంది. అవును.. ఈగ సినిమాకు ఇతడే నిర్మాత. అది పెద్ద హిట్ అయింది. విజేత కూడా అంతే పెద్ద హిట్టావ్వాలనే కోరికతో ఈగను రిలీజ్ చేసిన తేదీకే విజేతను థియేటర్లలోకి తీసురావాలని అనుకుంటున్నాడు సాయి.

రాకేశ్ శశి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలనచిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.