మరో సంక్రాంతి దర్శకుడు – సతీష్ వేగేశ్న

Tuesday,September 17,2019 - 12:03 by Z_CLU

అనిల్ రావిపూడి లాస్ట్ ఇయర్ ‘f2’ సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చాడు. ఆ తరవాత  మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్నా, ఈ సినిమా రిలీజయ్యేది సంక్రాంతికే.. ఫ్యూచర్ సినిమాల సంగతేమో కానీ అనిల్ రావిపూడి మాత్రం సంక్రాంతి సెంటిమెంట్ ని సీరియస్ గా తీసుకున్నాడనే అనిపిస్తుంది. అయితే ఈ వరసలో ఇంకో దర్శకుడు సతీష్ వేగేశ్న కూడా చేరాడు.

ఈ సంక్రాంతి బరిలో కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ కూడా ఉండబోతుంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు కానీ జనవరి 15 నుండి ఈ సినిమా సందడి చేయబోతుంది. సినిమా సంక్రాంతికి రిలీజవుతుంది కాబట్టి, ఈసారి  మళ్ళీ సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ దర్శకుడు.

సతీష్ వేగేశ్న రీసెంట్ సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ మంచి సినిమా అనిపించుకున్నా, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. అందుకే ఈ సారి కాస్త ప్లాన్డ్ గా ఉన్నాడు ఈ కుటుంబ కథా చిత్రాల దర్శకుడు. సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నాడు.

అందరూ అనుకున్నట్టు ‘ఎంత మంచి వాడవురా’ కూడా సక్సెసయితే, సతీష్ వేగేశ్న చేసే  ఫ్యూచర్ సినిమాలు కూడా సంక్రాతికే ఫిక్సవుతాడని అనిపిస్తుంది.