Kajal Aggarwal - బాలయ్య సినిమా సెట్స్ లో చందమామ

Tuesday,March 21,2023 - 03:17 by Z_CLU

Kajal Aggarwal Joins The Shoot Of Balakrishna, Anil Ravipudi Movie

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 108వ మూవీ ఇది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈనెల స్టా ర్టింగ్ లో షూట్ లో జాయిన్ అయింది శ్రీలీల. ఏజ్ లెస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడీ ముద్దుగుమ్మ కూడా లొకేషన్ లో జాయిన్ అయింది.

హైదరాబాద్‌లో జరుగుతున్న షూట్ లో కాజల్ జాయిన్ అయింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత రీ-ఎంట్రీలో కాజల్ చేస్తున్న తొలి సినిమా ఇదే. అంతేకాదు.. బాలకృష్ణతో కాజల్ నటిస్తున్న మొదటి చిత్రం కూడా ఇదే. బాలకృష్ణ, కాజల్ ఒకరినొకరు పిడికిలితో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.

బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో బాలయ్యది డిఫరెంట్ లుక్‌. ఇందులో బాలకృష్ణ మార్క్ యాక్షన్ తో పాటు.. అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయి. బాలకృష్ణతో ఇప్పటికే 2 సినిమాలు చేసిన తమన్, ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు.