ఇవి రెగ్యులర్ రీమేక్స్ కాదు

Tuesday,September 17,2019 - 11:02 by Z_CLU

రీమేక్స్ టాలీవుడ్ లో కొత్తేం కాదు. కానీ ఈ రీమేక్స్ టాలీవుడ్ రెగ్యులర్ ఫార్మాట్స్ ని బ్రేక్ చేయబోతున్నాయి. ఓ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ తెలుగులో రీమేక్ అవడం వేరు.. కానీ డిఫెరెంట్ స్టోరీస్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకున్న సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం ఓ చిన్న సైజు రివొల్యూషనే… అందునా ఈ సినిమాలను స్టార్ హీరోస్ ప్రిఫర్ చేయడం… మరింత క్రేజే ఫీలింగ్ ని జెనెరేట్ చేస్తుంది.

 

అంధాధున్ :  ఈ సినిమా రీమేక్ లో నితిన్ నటించబోతున్నాడు. ఈ సినిమాలో నితిన్ గుడ్డివాడిగా కనిపిస్తాడు. నేటివిటీ.. స్టార్ ఇమేజ్ లాంటివి మైండ్ లో పెట్టుకుని ఏమైనా చెంజే చేస్తే చెప్పలేం కానీ, ‘అంధాధున్’ మాత్రం ఏ మాత్రం రెగ్యులర్ మసాలా ఉన్న కమర్షియల్ సినిమా కానే కాదు…

 

బధాయి హో : సినిమాలో హీరో..  హీరోయిన్స్ బోలెడంత స్కోప్ ఉన్న  సినిమానే  కానీ ఈ సినిమా కథ తిరిగేది మాత్రం ఓ 50 ఏళ్ల విమెన్ చుట్టూ.. స్ట్రేట్ గా చెప్పాలంటే హీరో మదర్ ప్రెగ్నెన్సీ చుట్టూ… వెరీ వెరీ రేర్ స్టోరీ…

 96 : లవ్ స్టోరీ అనగానే.. రెగ్యులర్ అనిపిస్తుంది కానీ స్లో పేజ్ లో సాగే ఎమోషనల్ సినిమా. అందునా టాలీవుడ్ కి ఇది చాలా కొత్త. సినిమా మొత్తం హీరోలో హీరోయిజం కన్నా… హీరోయిన్ లో గ్లామర్ కన్నా మోస్ట్ కనెక్టెడ్ ఎమోషన్ తోనే డ్రైవ్ అవుతుంది. ఇలాంటి సినిమా టాలీవుడ్ లో రేర్ కాదు కానీ.. కొంచెం బాక్సాఫీస్ ని మైండ్ లో పెట్టుకుని మరీ డేర్ తో చేస్తున్న సినిమా.

వాల్మీకి: హీరో చుట్టూ తిరిగే సినిమా కాస్తా ఇక్కడికొచ్చేసరికి విలన్ చుట్టూ తిరుగుతుంది. అదే ఈ సినిమాలో కొత్తదనం. ఇలాంటి కథలు తెలుగులో వస్తాయని కలలో కూడా ఊహించం. పైగా హీరోలు నెగెటివ్ గా కనిపించడం మరీ కొత్త. అయినప్పటికీ ఈ సినిమా తెలుగులో రీమేక్ అవ్వడం, వరుణ్ తేజ్ లాంటి మెగా హీరో ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కనిపించడం చిన్నసైజు రివల్యూషన్ అనే చెప్పాలి.