వరల్డ్ ఫేమస్ లవర్ గా దేవరకొండ

Tuesday,September 17,2019 - 12:08 by Z_CLU

విజయ్ దేవరకొండ కొత్త సినిమా సంగతులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మాతగా ఆ సినిమా వస్తోంది. అయితే డియర్ కామ్రేడ్ ప్రమోషన్, రిలీజ్ కారణంగా ఈ సినిమా వివరాల్ని బయటకు రానీయలేదు. డియర్ కామ్రేడ్ హంగామా ముగియడంతో ఇప్పుడీ కొత్త సినిమా హంగామా మొదలైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు.

విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ ఎంత వెరైటీగా ఉందో, సినిమా కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుందంట. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ను 20వ తేదీన విడుదల చేయబోతున్నారు.

రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్, ఇసబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు దేవరకొండ.