సౌండ్ మార్చిన దర్శకులు

Friday,November 22,2019 - 10:03 by Z_CLU

కలిసొచ్చిన టెక్నీషియన్స్ ని మార్చి కొత్తదనం కోసం ట్రై చేస్తున్నారు దర్శకులు. మరీ ముఖ్యంగా మ్యూజిక్ కంపోజర్స్ విషయంలో… వరసగా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నా, సినిమాని మరింత డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నారు.

కొరటాల శివ : ఇప్పటి వరకు చేసిన 4 సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఈ కాంబినేషన్ మోస్ట్ సక్సే ఫుల్ గా ప్రూఫ్ అయింది. అయినా ఈసారి డిఫెరెన్స్ కోసం ట్రై చేశాడు కొరటాల.. DSP ప్లేస్ లో మణిశర్మను ఎంచుకున్నాడు…

 

కిషోర్ తిరుమల : గత 3 సినిమాలకు మ్యూజిక్ కంపోజర్ DSP నే. కానీ రామ్ తో చేస్తున్న ‘RED’ సినిమాకి మాత్రం మణిశర్మని ప్రిఫర్ చేశాడు. ఇప్పటి వరకు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న కిషోర్ తిరుమల సినిమాలు ఇక నుండి మరింత డిఫెరెంట్ గా మెస్మరైజ్ చేయనున్నాయి.

 

సతీష్ వేగేశ్న –  ‘శతమానం భవతి’ సక్సెస్ తరవాత నెక్స్ట్ సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ కి కూడా మిక్కీ నే ప్రిఫర్ చేశాడు సతీష్ వేగేశ్న. దాంతో ఇప్పుడు ‘ఎంత మంచివాడవురా’ కి కూడా ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతుందనుకున్నారంతా… కానీ సతీష్ ప్లాన్ మార్చి గోపీ సుందర్ కి ఫిక్సయ్యాడు.