సందీప్ రెడ్డి వంగ – బాలీవుడ్ ని అవాయిడ్ చేయడం కష్టమే!!

Saturday,June 29,2019 - 11:03 by Z_CLU

అర్జున్ రెడ్డి తీసినా, దాన్ని రీమేక్ చేసి ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో రిలీజ్ చేసినా.. సందీప్ రెడ్డి జస్ట్ హిట్ కొట్టడానికి కాదు.. స్ట్రేట్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడానికే సినిమాలు చేస్తాడనిపిస్తుంది. అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో ఏ స్థాయి  వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో, ‘కబీర్ సింగ్’ కూడా బాలీవుడ్ లో అదే తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

నిజానికి బాలీవుడ్ లో ఈ ‘కబీర్ సింగ్’ చేసేసి, మళ్ళీ బ్యాక్ టు టాలీవుడ్ అన్నది సందీప్ రెడ్డి ప్లాన్. కానీ వరస చూస్తుంటే బాలీవుడ్ ని అవాయిడ్ చేయడం అంత ఈజీ కాదనిపిస్తుంది. ‘కబీర్ సింగ్’ తరవాత ఆల్మోస్ట్ టాప్ బాలీవుడ్ స్టార్స్ దృష్టి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగపైనే ఉంది. ఎక్కడ చూసినా ‘కబీర్ సింగ్’ హవా నడుస్తుంది.

కబీర్ సింగ్ కాస్త అటూ ఇటూ టాక్ తో సరిపెట్టుకున్నా, సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ కి బై చెప్పినట్టే అనుకోవడానికి ఉండేది… కానీ ఇప్పుడు ఆ అవకాశం అస్సలు కనిపించట్లేదు. బాక్సాఫీస్ దగ్గర రూల్ చేస్తున్న కబీర్ సింగ్, సందీప్ రెడ్డిని ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో కూడా టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేర్చేసింది.

సందీప్ రెడ్డి చుట్టూ బాలీవుడ్ లో క్రియేట్ అవుతున్న క్రేజ్ చూస్తుంటే, జస్ట్ ‘కబీర్ సింగ్’ తో ఆగేలా లేదు. సందీప్ రెడ్డి ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు మహేష్ బాబుతో ఇక్కడ సినిమా చేసినా, సైమల్టేనియస్ గా బాలీవుడ్ లో కూడా అదే రేషియో మెయిన్ టైన్ చేస్తాడనిపిస్తుంది.