సాయి తేజ్ కూడా అంతేనేమో!!

Saturday,June 29,2019 - 10:02 by Z_CLU

సాయి తేజ్ ఈసారి సినిమాలో ఏ డిఫెక్ట్ ని డీల్ చేస్తాడు…? మారుతి సినిమాల్లో నాని నుండి బిగిన్ అయితే నాగచైతన్య వరకు అందరూ ఇలా ఏదో ఒక డిఫెక్ట్ ని డీల్ చేసినవాళ్ళే. అందుకే ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సాయి తేజ్ సినిమా ‘ప్రతిరోజు పండగే’ లో ఎలా కనిపించబోతున్నాడా..? అనే క్యూరియాసిటీ రేజ్ అవుతుంది.

నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో మతిమరుపు ఉన్నవాడిలా నటించాడు. సినిమా బ్లాక్ బస్టర్. సినిమాలో హీరోకి ఉండే ఆ ఒక్క డిఫెక్ట్ సక్సెస్ కి కావాల్సినంత కామెడీని జెనెరేట్ చేసింది. ఆ సక్సెస్ ఇంపాక్ట్ తో మారుతి ఆ తరవాతి సినిమాని కూడా అటూ ఇటూగా అలాగే ప్లాన్ చేసుకున్నాడు.

‘మహానుభావుడు’ లో శర్వానంద్ ని OCD ఉన్నవాడిలా చూపించాడు. ఈ సినిమా కూడా సక్సెసే. అందుకే నెక్స్ట్ టైమ్ మరీ హీరోకి డిఫెక్ట్ పెట్టకుండా, ఈగోయిస్టిక్ క్యారక్టర్స్ మధ్య హీరోని పెట్టేసి ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఆ సినిమా కూడా సూపర్ హిట్టే…

అందుకే ఈసారి మారుతి మైండ్ లో ఏం నడుస్తుందా..? సాయి తేజ్ ని ఎలా ప్రెజెంట్ చేయలనుకుంటున్నాడా..? అనే క్యూరియాసిటీ ఆడియెన్స్ లో కనిపిస్తుంది.