రష్మిక బాలీవుడ్ కు వెళ్తుందా..?

Saturday,June 29,2019 - 01:59 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ హాట్ ఫేవరెట్ రష్మిక. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ తమిళ్ లో కూడా సినిమాలకు సైన్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమె బాలీవుడ్ బాట పట్టిందంటూ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఇందులో నిజం ఎంత?

గీతగోవిందం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. అటు సూపర్ హిట్ అయిన మరో మూవీ జెర్సీని కూడా హిందీలో తీయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. గమ్మత్తయిన విషయం ఏంటంటే.. ఈ రెండు రీమేక్స్ కోసం కూడా రష్మికనే సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు చాలామంది.

కానీ నిజం ఏంటంటే.. ప్రస్తుతానికి రష్మికకు బాలీవుడ్ కు వెళ్లే ఉద్దేశం లేదు. రీసెంట్ గా ఓ సౌత్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసింది ఈ భామ. దీనికి ఆమె ఓ చిన్న లాజిక్ కూడా ఇచ్చింది.

ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతున్నానని, బాలీవుడ్ ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేసే టైమ్ కూడా ఉండడం లేదని అంటోంది. అలాంటప్పుడు కాల్షీట్లు ఎలా కేటాయిస్తానని ప్రశ్నిస్తోంది. అదీ సంగతి.