సందీప్ రెడ్డి వంగ – అక్కడ కూడా అంతే!!

Tuesday,June 25,2019 - 01:02 by Z_CLU

కథ మారలేదు… మహా అయితే స్టార్స్ మారారేమో కానీ.. సినిమా తెరకెక్కిన విధానం కూడా మారలేదు.. అందుకే రిజల్ట్ కూడా మారలేదు. తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే బాలీవుడ్ లో కూడా దుమ్ము రేపుతుంది ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’. మొదటి సినిమాతో ఇక్కడ మార్క్ క్రియేట్ చేశాడు… అదే సినిమాని రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కేటప్పుడు కూడా అది చాలా చిన్న సినిమానే. అర్జున్ రెడ్డి సినిమాకి ముందు విజయ్ దేవరకొండ పరిచయమున్న నటుడే కానీ, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రేంజ్ స్టార్ హీరో కూడా కాదు… కానీ అర్జున్ రెడ్డి ని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది ఆ సినిమా టీజర్.

కబీర్ సింగ్ విషయంలో కూడా అంతే. కాకపోతే అక్కడ షాహీద్ కపూర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టార్. ఈ హీరో కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే ఫ్యాన్స్ ఈసారేదో కొత్తగా ఉండబోతుంది అనుకున్నారు… కానీ ఈ రేంజ్ సెన్సేషనల్ సినిమా అవుతుందని అస్సలు ఎక్స్ పెక్ట్ కూడా చేయలేదు. షాహిద్ కపూర్ కరియర్ లోనే బెస్ట్ అనిపించుకుంటుంది ‘కబీర్ సింగ్’.

ఏది ఏమైనా ఒక్క సినిమా సందీప్ రెడ్డి వంగని ప్యాన్ ఇండియా ఫిలిమ్ మేకర్ ని చేసేసింది. రెగ్యులర్ సినిమా ధోరణిలో కొట్టుకుపోవడాన్ని నమ్మని ఈ యంగ్ డైరెక్టర్, జస్ట్ టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ‘నేను కొంచెం వేరు’ అనే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకున్నాడు.