ఫస్ట్ టైమ్ – ఆన్ స్క్రీన్ జంటలు

Tuesday,June 25,2019 - 02:02 by Z_CLU

వరసగా లాంచ్ అవుతున్నాయి కొత్త సినిమాలు.. వాటికి తోడు సెట్స్ పైకి వస్తున్నాయి కొత్త జంటలు… స్టార్ హీరోలు ఇప్పటి వరకు స్క్రీన్ షేర్ చేసుకొని హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నారు…

చిరంజీవి : ‘సైరా’ లో ఫస్ట్ టైమ్ నయనతార, తమన్నాలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు మెగాస్టార్. ఇప్పటి వరకు వీరిద్దరితో సినిమాలు చేయలేదు చిరు. నయనతార సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంటే.. తమన్నా సినిమాలోని కీలక సన్నివేశంలో కనిపించనుంది.

 

ప్రభాస్ – ‘సాహో’ లో ఫస్ట్ టైమ్ శ్రద్ధా కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ జస్ట్ ప్రభాస్ లవ్ ఇంట్రెస్ట్ గానే కాదు.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ లలో కనిపించనుంది.

నితిన్ : ఈ హీరో ప్రస్తుతం అనౌన్స్ చేసిన సినిమాల్లో హీరోయిన్స్ అందరూ ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వాళ్ళే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘భీష్మ’ లో రష్మిక హీరోయిన్… ఫస్ట్ టైమ్ జోడీ కట్టాడు. ఇక వెంకీ అట్లూరి తో చేస్తున్న ‘రంగ్ దే’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమాతో పాటు రీసెంట్ గా లాంచ్ అయిన చంద్రశేఖర్ యేలేటి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ ఇద్దరు హీరోయిన్స్ గా ఫిక్సయ్యారు.

నాగచైతన్య –  రాశిఖన్నా ఇప్పటి వరకు నాగచైతన్య సరసన నటించలేదు. ‘వెంకీమామ’ తో ఈ కాంబినేషన్ కుదిరింది. ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్స్ స్టిల్స్ బయటికి రాలేదు కానీ ఈ ఆన్ స్క్రీన్ ఈ ఇద్దరి జంట అదిరిపోతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

మహేష్ బాబు –  కరియర్ బిగినింగ్ లోనే మహేష్ బాబు సరసన ‘సరిలేరునీకెవ్వరు’ లో చాన్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది రష్మిక. ఈ సినిమాతో ఒక్కసారిగా రష్మిక స్టార్ స్టేటస్ మారిపోయింది.

వెంకటేష్ – ‘వెంకీమామ’ లో నటిస్తుంది పాయల్ రాజ్ పుత్. వెంకీ సరసన హీరోయిన్ గా కనిపించనుంది.ఇప్పటి వరకు జస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతో వెంకీ మార్క్ ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకోనుంది.

నాగార్జున – గతంలో నాగచైతన్య తో స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మధుడు 2’ లో నాగ్ సరసన నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి రిలీజైన పోస్టర్స్ లో ఈ ఇద్దరి కెమిస్ట్రీకి మంచి అప్లాజ్ కూడా వస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా కామియో రోల్ ప్లే చేస్తుంది. నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ హీరోయిన్ కి కూడా ఇదే ఫస్ట్ టైమ్.