ఇంతకీ సంపూ కి ఏమైంది ?

Monday,January 02,2017 - 07:00 by Z_CLU

‘హృదయ కాలేయం’ తో కామెడీ హీరో గా ఎంట్రీ ఇచ్చి  సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని బర్నింగ్ స్టార్ ఇమేజ్ తో హల్చల్ చేసిన  సంపూర్ణేష్ ఎమయ్యాడు? సంపూ థియేటర్స్ లో కొచ్చి దాదాపు 2 ఏళ్ళు కావొస్తుంది. ‘సింగం 123’ తో 2015 లో థియేటర్స్ లోకొచ్చి ఆడియన్స్  ఎంటర్టైన్ చేసిన సంపూ 2016 లో వినోదం 100 % సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించాడు.

 సంపూర్ణేష్ లేటెస్ట్ సినిమా ‘కొబ్బరి మట్ట’ సినిమా సాంగ్, టీజర్ రిలీజ్ అయ్యి చాలా నెలలే కావొస్తున్నా ఈ సినిమా మాత్రం థియేటర్స్ లో కి రావడం లేదు. టీజర్ తో మొన్నా మధ్య హల్చల్ చేసిన ఈ సినిమా ఆలస్యానికి కారణం ఏమిటో? కానీ హాస్య ప్రియులు మాత్రం ఈ కామెడీ హీరో ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెట్టి నవ్విస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.. మరి 2017 లో అయినా సంపూ ‘కొబ్బరి మట్ట’ సినిమా తో థియేటర్స్ లోకొస్తాడని ఆశిద్దాం