కొనసాగుతున్న కుమ్ముడు

Monday,January 02,2017 - 08:00 by Z_CLU

మెగాస్టార్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో హల్ చల్ చేస్తూ దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా చిరు నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే సింగిల్ ట్రాక్ ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

  ప్రెజెంట్ ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ వ్యూస్ తో సోషల్ మీడియాలో కుమ్మేస్తోంది. ఈ మధ్య టీజర్, ట్రైలర్ తో స్టార్ హీరో లు యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధిస్తుండగా… కేవలం ఒకేఒక్క పాటతో 8 మిలియన్ వ్యూస్ సాధించి మెగా స్టామినా చాటుతూ దూసుకుపోతున్నాడు చిరు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట రిలీజ్ నుంచే అందరినీ ఎట్రాక్ట్ చేసి సూపర్ హిట్ సాంగ్ గా మారింది. మరి త్వరలోనే ఈ సాంగ్ తో మెగా స్టార్ 10 మిలియన్ వ్యూస్ సాధించి సరి కొత్త రికార్డు నెలకొల్పడం ఖాయం..