2017 స్పెషల్ ఎట్రాక్షన్స్

Monday,January 02,2017 - 06:00 by Z_CLU

2016 ఎంత గ్రాండ్ గా బిగిన్ అయిందో అంతే సక్సెస్ ఫుల్ గా గుడ్ బై చెప్పేసింది. 2017 కూడా లెక్కలేనన్ని సర్ ప్రైజెస్ తో బోలెడన్ని ఎట్రాక్షన్ తో రెడీగా ఉంది. రిలీజ్ కి రెడీ గా ఉన్న సంథింగ్ స్పెషల్ మూవీస్ తో 2017 ప్రీ ప్లాన్డ్ గా ఉంది.

 

baahubali-2

‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు. మొత్తం ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది ఈ సమాధానం కోసం. దీనికి ఆన్సర్ ఈ ఏడాది దొరికిపోతుంది. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న బాహుబలి – ది కంక్లూజన్ ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతుంది.

gautamiputra-satakarni

2017 కి మరింత వెయిట్ పెంచిన అట్రాక్టివ్ ఎలిమెంట్ ‘గౌతమీపుత్రశాతకర్ణి’. బాలయ్య కెరీర్ లో వందో సినిమా అనేది ఓ యాంగిల్ అయితే, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథ మరో ఎలిమెంట్. అందులో 2017 మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో శాతకర్ణి కూడా చేరిపోయింది.

khaidi-no-150

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాలయ్యకు ఎంత ప్రతిష్టాత్మకమో, ‘ఖైదీ నంబర్-150’ కూడా చిరంజీవికి అంతే ప్రతిష్టాత్మకం. నటసింహానికి శాతకర్ణి సినిమా సెంచరీ మూవీ అయితే, మెగా స్టార్ కు ఖైదీ మూవీ 150వ వెంచర్. పైగా ఇది మెగాస్టార్ రీఎంట్రీ మూవీ. దాదాపు మూడేళ్లుగా చిరు సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, ఎట్టకేలకు ఆ కోరిక ఈ ఏడాది తీరబోతోంది.

 

katamarayudu-2

ఇక ఈ ఏడాది మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ‘కాటమరాయుడు’ కూడా ఉంది. సాధారణంగా పవన్ ఏ సినిమా చేసినా దాని క్రేజే వేరు. కానీ ఈ ఏడాది మాత్రం పవన్ కెరీర్ లోనే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే… పవన్ ఈ ఏడాది కుదిరితే 3, కాని పక్షంలో కనీసం 2 సినిమాలు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

mahesh-23

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. అయితేనేం ఆ ప్రాజెక్టు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే.. ఆ కాంబినేషన్ అలాంటిది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తే బాగుంటుందని కోరుకున్న కోట్లాదిమంది ప్రేక్షకుల కోరిక ఈ ఏడాదే తీరనుంది.

robo-2-another

2017 మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో 2.0 కూడా ఉంది. ఈ మూవీ కోసం కూడా ప్రేక్షకులు మూడేళ్లుగా వెయిటింగ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏడాదిన్నర అయింది. ఫైనల్ గా ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ లో ఈ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ థియేటర్లలోకి రానుంది.