స్పీడ్ అందుకున్న సమంతా ‘U టర్న్’

Thursday,April 12,2018 - 04:10 by Z_CLU

సమంతా లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘U టర్న్’ సెకండ్ షెడ్యూల్ బిగిన్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లో సమంతా, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, వీలైనంత ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

 ఒక ఫ్లై ఓవర్ పై మిస్టీరియస్ గా జరిగే ఆక్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది U టర్న్. వరసగా జరిగే ఆ ఆక్సిడెంట్స్ వెనక ఉన్న రీజన్స్ ని బయటపెట్టే, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా సమంతా పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఆది పినిశెట్టి ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు.

ఇప్పటికే కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో తెలుగు లోను అదే రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. భూమిక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి పవన్ కుమార్ డైరెక్టర్.