నాగ్ సూపర్ హిట్ సాంగ్ నాగచైతన్య సవ్యసాచిలో...

Thursday,April 12,2018 - 04:53 by Z_CLU

నాగచైతన్య సవ్యసాచి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తే, డిఫెరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కుతున్న సవ్యసాచిపై రోజు రోజుకి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే చైతు కరియర్ లోనే అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఎలిమెంట్ ని ఆడ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. నాగార్జున కరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు’ ని ఈ సినిమాలో చేర్చనున్నారు ఫిల్మ్ మేకర్స్.

1993 లో రిలీజైన ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ జంటగా పర్ఫామ్ చేసిన ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఆ పాటను ‘సవ్యసాచి’ సినిమాలో స్పెషల్ సాంగ్ లా ప్రెజెంట్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఈ సాంగ్ లో చైతు తో పాటు స్టెప్స్ వేయనున్న బ్యూటీ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్న ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఆ డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న కీరవాణి, నాగ్ ‘అల్లరి అల్లుడు’ సినిమాకు కూడా ట్యూన్స్ కంపోజ్ చేశాడు.

అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భూమిక తో పాటు మాధవన్ కీ రోల్స్ ప్లే చేశారు. జూన్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.