షూటింగ్ అప్ డేట్స్

Thursday,April 12,2018 - 01:27 by Z_CLU

రామ్ – హలో గురు ప్రేమకోసమేరా

త్రినాథ్ రావు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది హలో గురు ప్రేమకోసమేరా. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 4 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రామ్, అనుపమ కాంబినేషన్ లో రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ తరవాత  నెక్స్ట్  షెడ్యూల్  జూన్  నుండి బిగిన్  చేసే  ప్లాన్  లో ఉన్నారు  ఫిల్మ్  మేకర్స్.

 

నితిన్ – శ్రీనివాస కళ్యాణం

రీసెంట్ గా అమలాపురంలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది శ్రీనివాస కళ్యాణం టీమ్. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉన్న టీమ్, ఈ నెల 17 నుండి చండీగడ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 20 రోజుల పాటు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ లో నితిన్, రాశిఖన్నా కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత 3 వ షెడ్యూల్ అమలాపురం లో ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, ఈ సినిమాని మ్యాగ్జిమం జూలై  లాస్ట్  వీక్   లేదా ఆగష్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.  ఈ సినిమాకి సతీష్ వేగేశ్న  డైరెక్టర్.

 

బెల్లంకొండ శ్రీనివాస్ – సాక్ష్యం

ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం.  వెన్నెల కిషోర్, పూజా హెగ్డే, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లోనే ఒక సాంగ్ ని కూడా తెరకెక్కించనుంది. ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్.

 

 

నాగశౌర్య – నర్తనశాల 

శ్రీనివాస చక్రవర్తి డైరెక్షన్ లో నాగశౌర్య ‘నర్తనశాల’ షూటింగ్ ఈ  రోజు  నుండి హైదరాబాద్ లో బిగిన్  అయింది.   నాగశౌర్య తో పాటు మరికొంత మంది యాక్టర్స్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.  ‘ఛలో’ సక్సెస్ తర్వత సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో సినిమా యూనిట్.