మహాసముద్రంలో మార్పుచేర్పులు

Monday,February 17,2020 - 12:30 by Z_CLU

అజయ్ భూపతి దర్శకత్వంలో రావాల్సిన మహాసముద్రం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. మొన్నటివరకు ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో అదితి రావును తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

మహాసముద్రం ప్రాజెక్టు ముందు రవితేజ దగ్గరకెళ్లింది. కానీ వర్కవుట్ కాలేదు. తర్వాత నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా ఆ సినిమా ఫైనలైజ్ అయినట్టు టాక్ బయటకొచ్చింది. కానీ తర్వాత నాగచైతన్య స్థానంలో శర్వానంద్ వచ్చి చేరాడు. ఇప్పుడు సమంత కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాక్.

ఆర్ఎక్స్100 లాంటి సూపర్ హిట్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేకపోయాడు అజయ్ భూపతి. మహాసముద్రం ప్రాజెక్ట్ పై అతడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆర్ఎక్స్100ను మించిన విజయాన్ని మహాసముద్రం తనకు అందిస్తుందని భావిస్తున్నాడు. అందుకే లేట్ అయినా మరో ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవ్వకుండా.. మహాసముద్రంపైనే ఫోకస్ మొత్తం పెట్టాడు.