Mahasamudram - మరో హీరోయిన్ ఫిక్స్

Monday,October 19,2020 - 01:26 by Z_CLU

Sharwanand-Siddharth తో దర్శకుడు అజయ్ భూపతి Mahasamudram అనే టైటిల్ తో లవ్ అండ్ యాక్షన్ జానర్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా Aditi Rao ను తీసుకున్న మేకర్స్ తాజాగా మరో హీరోయిన్ ను ఫైనల్ చేశారు.

సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా Anu Emmanuel కనిపించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. AK Entertainments బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది.

సినిమాలో Anu Emmanuel సిద్దార్థ్ కి జోడీగా కనిపించనుందనే టాక్ ఉంది.