'మెగా 153' ఫిక్సయిందా ?

Monday,February 17,2020 - 11:20 by Z_CLU

‘ఖైదీ నం 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ మళ్ళీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 152వ సినిమాను చేస్తున్న చిరు లేటెస్ట్ గా 153 వ సినిమాను కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది.

చిరు నెక్స్ట్ హరీష్ శంకర్ తో సినిమా చేసే చాన్స్ ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ గా ‘వాల్మీకి’ తో సూపర్ హిట్ అందుకున్న హరీష్ ఇటివలే చిరుని కలిసి ఓ కథ వినిపించాడని అంటున్నారు. అన్నీ కుదిరితే పవన్ కళ్యాణ్ కంటే ముందు మెగా స్టార్ ని డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడట హరీష్. మరి కొరటాల తర్వాత చిరు హరీష్ కే అవకాశం ఇస్తారా లేదా లిస్టులో ఉన్న త్రివిక్రమ్ , సుకుమార్ తో సినిమా చేస్తారా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.