#Mahasamudram - సిద్ధు రెమ్యునరేషన్ ఎంత?

Sunday,July 11,2021 - 07:53 by Z_CLU

కెరీర్ ఆరంభంలో ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న సిద్దార్థ్ చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. శర్వానంద్ తో కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు సిద్దు. అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇటివలే షూటింగ్ పూర్తయింది. సెకండ్ వేవ్ కి ముందు కొన్ని రోజులు షూట్ బ్యాలెన్ ఉంది. ఆ బ్యాలెన్స్ షూట్ ని ఇటివలే ఓ షెడ్యుల్ ఫినిష్ చేశారు. సిద్దు , శర్వానంద్ ఇద్దరిపై కీలక సన్నివేశాలు తీశారు.

Siddharth Mahasamudram 2

అయితే ఈ సినిమాకోసం సిద్దు 2 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఈ సినిమా కోసం సిద్దు ఇచ్చిన డేట్స్ కేవలం 30 రోజులు మాత్రమే అట. సినిమా కథంతా శర్వా , సిద్దులపైనే నడుస్తుంది. కాకపోతే సిద్దు కాస్త నెగిటివ్ రోల్ అని సమాచారం. గుడ్ బాయ్ గా కనిపిస్తూ ఫైనల్ గా విలన్ గా మారే క్యారెక్టర్ అని తెలుస్తుంది. అందుకే ఈ క్యారెక్టర్ నచ్చి సిద్దు తెలుగులో మహాసముద్రం ఒప్పుకున్నాడని టాక్.

maha samudram

ఆర్ ఎక్స్ 100తో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నఅజయ్ భూపతి మహా సముద్రం కథను రెడీ చేసుకొని కొందరు హీరోలకి వినిపించి ఫైనల్ గా శర్వానంద్ ని సిద్దు లను ఫైనల్ చేసుకొని వీరిద్దరి కాంబోలో సినిమాను పూర్తి చేశాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తాడా? లేదా తనని ఎగ్జైట్ చేసే ఇలాంటి సెలెక్టివ్ రోల్స్ మాత్రమే చేస్తాడా ? చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics