'లోకల్ బాయ్' గా వస్తున్న ధనుష్

Monday,February 17,2020 - 04:59 by Z_CLU

కథానాయకుడిగా ధనుష్‌ ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘మారి’లో లోకల్ డాన్‌ గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నాడు. ఇప్పుడు తమిళ ప్రాచీన యుద్ధవిద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన ‘లోకల్ బాయ్’ తో ఈ నెలాఖరున తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో  ద్విపాత్రాభినయం చేసాడు ధనుష్. ‘ధర్మయోగి’ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌, ఈ ‘లోకల్ బాయ్’ ను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు.  మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. స్నేహ మరో హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా నటించాడు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది.