సాయి పల్లవి కొత్త సినిమా సెప్టెంబర్ లో...

Wednesday,August 02,2017 - 01:05 by Z_CLU

మళయాళ ప్రేమమ్ సినిమాతో సినిమా ఫ్యాన్స్ కి దిల్ కీ ధడ్కన్ లా మారిన సాయి పల్లవి రీసెంట్ గా ఫిదా సినిమాతో మరింత దగ్గరయింది. అయితే సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. ప్రస్తుతం నాని సినిమా M.C.A సినిమా సెట్స్ పై ఉన్న సాయి పల్లవి మళయాళ సూపర్ హిట్ ‘కలి’ ఇప్పుడు తెలుగులోకి రిలీజ్ కానుంది.

మలయాళం లో దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఈ సినిమాని సెప్టెంబర్ లో తెలుగులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. సమీర్ తాహిర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్.