ఫ్రైడే రిలీజ్

Wednesday,August 02,2017 - 02:04 by Z_CLU

లాస్ట్ ఫ్రైడే సరికొత్త సినిమాలతో ఎగ్జైటెడ్ గా బిగిన్ అయి, అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఈ ఫ్రైడే కూడా అదే జోష్ తో బాక్సాఫీస్ రెడీ అయింది. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి దూసుకొస్తున్న సరికొత్త సినిమాలివే…

నక్షత్రం : ఈ వీకెండ్ మోస్ట్ అవేటెడ్ మూవీ లిస్టులో ఉన్న సినిమా ఇది. కృష్ణవంశీ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా, సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో రిలీజ్ కి ముందే ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రెజీనా కసాంద్ర, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరన్ స్పెషల్ సాంగ్ చేసింది.

 

దర్శకుడు : సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హిట్ కుమారి 21 F తరవాత తెరకెక్కిన సినిమా ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా నటించిన ఈ సినిమాని హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించాడు. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నిలబడనుందో చూడాలి.

ఇదేం దెయ్యం :శ్రీనాథ్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చ రవి, కిరాక్ RP, రచన స్మిత్ నటించిన ఇదేం దెయ్యం ఈ ఫ్రైడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. V. రవివర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ కి S. సరిత. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేయనుందో చూడాలి.

వశం : నంద కిషోర్, వాసుదేవ రావు, శ్వేత వర్మ నటించిన వశం కూడా ఈ ఫ్రైడే రిలీజవుతుంది. చల్లా శ్రీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఏ ప్లేస్ నిలుస్తుందో చూడాలి.

 

జబ్ హ్యారి మెట్ సేజల్ : టాలీవుడ్ లో మరో మోస్ట్ అవేటెడ్ బాలీవుడ్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సేజల్’ కూడా భారీ హంగామా చేస్తుంది. షారుక్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమాకి  ఇంతియాజ్ అలీ డైరెక్టర్. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.