మరికొన్ని గంటల్లో స్పైడర్ హంగామా

Wednesday,August 02,2017 - 12:18 by Z_CLU

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా వస్తున్న స్పైడర్ సినిమా హంగామా మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ ప్రాసెస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా బూమ్ బూమ్ అనే లిరిక్స్ తో సాగే ఫస్ట్ సింగిల్ ను ఈరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు విడుదల చేయబోతున్నారు.

మహేష్-రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ టీజర్ రిలీజైంది, మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు

6 దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 27న స్పైడర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.