ఆ వార్తలో నిజం లేదు....

Wednesday,March 01,2017 - 02:02 by Z_CLU

టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్స్ వార్తలు  చక్కర్లు కొడుతూ ఆడియన్స్ ను ఊరిస్తుంటాయి. అయితే లేటెస్ట్ గా ఇలాంటి ఓ వార్తే సాయి ధరమ్ తేజ్ చుట్టూ తిరుగుతుంది… ఇటీవలే ‘విన్నర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి ధరమ్ త్వరలోనే వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త నిన్నటి వరకూ టాలీవుడ్ సరౌండింగ్ లో చక్కర్లు కొట్టింది..


లేటెస్ట్ గా ఈ వార్త లో నిజం లేదని  తేల్చి చెప్పేశాడు  మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో తేజ్ ఈ విషయం పై స్పందిస్తూ ” వినాయక్ గారిని ఓ రెండు మూడు సార్లు కలిసాను కానీ అది సినిమా గురించి మాత్రం కాదు. ప్రస్తుతానికి మా కాంబినేషన్ లో అలాంటిదేం లేదు. ప్రెజెంట్ ‘జవాన్’ సినిమా మాత్రమే చేయబోతున్నా… కానీ ఛాన్స్ ఉంటె మాత్రం కచ్చితంగా వినాయక్ గారితో ఓ సినిమా చేయాలనీ అయితే ఉంది..” అని తెలిపాడు. అంటే సాయి ధరమ్ తేజ్ వినాయక్ కాంబినేషన్ లో సినిమా కేవలం వార్తే అన్నమాట….