ఖైదీ నం 150 ఓవరాల్ కలెక్షన్స్

Wednesday,March 01,2017 - 12:48 by Z_CLU

ఖైదీ నం 150 రిలీజై ఇవాళ్టికి 50 డేస్ కంప్లీట్ అయింది. ఏకంగా 53 సెంటర్ లలో 50 డేస్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా సక్సెస్ ని మెగా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. లోకల్ మార్కెట్ లోనే కాక ఓవర్ సీస్ లోను తన స్టామినాని చాటుకున్న మెగాస్టార్, ఫ్యాన్స్ లో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూఫ్ చేసుకున్నాడు.

ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 105.5 కోట్ల షేర్ వసూలు చేసిన ఖైదీ నం 150 మెగాస్టార్ కరియర్ లోనే బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వి.వి. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ రియల్ స్టామినాని ఎలివేట్ చేయడంలో కంప్లీట్ గా సక్సెస్ అయింది.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి DSP మాస్ ట్యూన్స్ పెద్ద ఎసెట్ గా నిలిచాయి. దానికి తోడు ఏ మాత్రం స్పీడ్ తగ్గని మెగా స్టెప్స్ సినిమాని ఈజీగానే సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కించేశాయి.