సాక్ష్యం మూవీ టీజర్ రివ్యూ

Wednesday,April 18,2018 - 01:44 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సాక్ష్యం. ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి కిందట అభిషేక్ పిక్చర్స్, జీ సినిమాలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేశారు. కంప్లీట్ యాక్షన్ అండ్ క్యూట్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ టీజర్ చాలా గ్రాండియర్ గా, రిచ్ గా ఉంది.

మూవీలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనే విషయం సాక్ష్యం టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఇక హీరో శ్రీనివాస్ అయితే మ్యాచో లుక్ తో అదరగొట్టాడు. అతడి సిక్స్ ప్యాక్ లుక్, యాక్టింగ్.. టీజర్ లో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. కేవలం గ్లామ్ డాళ్ గా మాత్రమే కాకుండా.. సినిమాలో వెరీ ఇంపార్టెంట్ రోల్ లో ఆమె కనిపించనుందనే విషయం టీజర్ లో స్పష్టంగా తెలుస్తోంది.

హీరోహీరోయిన్లతో పాటు విలన్ జగపతిబాబు, కమెడియన్ వెన్నెల కిషోర్, శరత్ కుమార్ లాంటి కీలక పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేశారు. విల్సన్ సినిమాటోగ్రఫీ, హర్షవర్థన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు శ్రీవాస్ టేకింగ్ టీజర్ లో మెయిన్ హైలెట్స్.

ఓవరాల్ గా సాక్ష్యం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది టీజర్. రిచ్ గా ఉన్న ఈ టీజర్ ఇనిస్టెంట్ గా క్లిక్ అయింది. మే 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది సాక్ష్యం.