రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి

Monday,July 30,2018 - 12:10 by Z_CLU

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామ నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ నెల 27న సినిమా విడుదలైంది. అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా యూనిట్ లోని కీలక సభ్యులతో సక్సెస్ మీట్ నిర్వహించారు.

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ –
”అమేజింగ్‌ కాన్సెప్ట్‌. పంచభూతాలు అనే కాన్సెప్ట్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన శ్రీవాస్‌గారికి, ఆయనకు తోడ్పాటు అందించిన నిర్మాత అభిషేక్‌గారికి.. సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా కంగ్రాట్స్‌. బెల్లకొండ సాయిశ్రీవాస్‌ చాలా కష్టపడి సినిమా చేశాడు. టీమ్‌ అందరం చాలా కష్టపడ్డాం కాబట్టే మంచి అవుట్‌పుట్‌ను రాబట్టుకోగలిగాం” అన్నారు.

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ –
”కొత్త సబ్జెక్ట్‌ను నమ్మి సినిమా చేశాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌. ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. తప్పు చేస్తే ప్రకృతి మనల్ని చూస్తుంటుంది అనే భావన అందరిలో కలగాలనే చేసిన మా ప్రయత్నం ఈ రోజు సక్సెస్‌ అయింది. అది సినిమా సక్సెస్‌తో నిరూపణ అయింది. మన అందరిలో ఉండే దైవత్వ భావన ఇలాంటి సినిమాలను చూసి ఆదరిస్తున్నప్పుడు బయటకు తెలుస్తుంటుంది. పంచభూతాలు అనే కాన్సెప్ట్‌కు పీటర్‌ హెయిన్స్‌గారు అద్భుతంగా యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేశారు. ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే ఇంకా కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఆలోచిస్తాను. నేనే కాదు.. అందరూ కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు” అన్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ –
”మంచి సినిమాలను విజయవంతం చేస్తామని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సాయిమాధవ్‌గారి డైలాగ్స్‌, పీటర్‌ హెయిన్స్‌గారి యాక్షన్‌, హర్షవర్ధన్‌గారి సంగీతంతో పాటు అభిషేక్‌గారి అన్‌ కాంప్రమైజ్‌డ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ సినిమా సక్సెస్‌లో కీలకంగా మారాయి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్‌” అన్నారు.