మహానటి కోసం 100 మంది చేనేత కార్మికులు

Wednesday,April 18,2018 - 11:03 by Z_CLU

మహానటి సినిమా మే 9 గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాలో ఎంత మంది నటించినా, సినిమాలోని మెయిన్ థీమ్ మాత్రం సావిత్రి గారి లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేయడమే. అయితే ఈ బయోపిక్ లో సావిత్రి రోల్ లో కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని బిగిన్  చేసింది మహానటి టీమ్. జస్ట్ కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ కోసం ఏకంగా 100 చేనేత కార్మికులు సంవత్సరం పాటు పని చేశారంటే ఈ బయోపిక్ ని మహానటి టీమ్ ఎంత సీరియస్ గా తీసుకుందో తెలుస్తుంది.

సినిమా సెట్స్ పైకి రాకముందే దర్శకుడు నాగ్ అశ్విన్ పెద్ద రీసర్చే చేశాడు. అటు కరియర్ తో పాటు సావిత్రి  పర్సనల్ లైఫ్ గురించి ప్రతి అంశాన్ని డీటేల్డ్ గా పరిశీలించిన ఫిల్మ్ మేకర్స్, ప్రతీది పర్ఫెక్ట్ గా ఉందని క్లారిటీ వచ్చాకే  సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చారు.

 

సావిత్రి బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుండి అప్పటి సినిమాల్లో  సావిత్రి  నటించిన  సినిమాల  సెట్స్ వరకు ప్రతి విషయాన్ని ఏ మాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్న మహానటి ఫిల్మ్ మేకర్స్, ఒక్క కీర్తి సురేష్ విషయంలోనే కాదు, అప్పటి సెట్స్ దగ్గరి నుండి సావిత్రి మరీ దగ్గరగా ఉన్న ఇతరత్రా సీనియర్ ఆర్టిస్టులు ANR, SVR, జెమినీ గణేషన్ లాంటి సీనియర్ నటుల రోల్స్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకున్నారు ఫిల్మ్ మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని ప్రియాంక దత్ తో పాటు స్వప్నదత్ నిమిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజర్.