సాక్ష్యం ట్రయిలర్: సిసలైన కమర్షియల్ సినిమా

Sunday,July 08,2018 - 09:35 by Z_CLU

అతీత శక్తులు.. పంచభూతాలు.. భారీ యాక్షన్ సన్నివేశాలు.. అందమైన హీరోయిన్.. సూపర్ హిట్ సాంగ్స్.. ఇలా సిసలైన కమర్షియల్ సినిమాకు సరికొత్త ఎగ్జాంపుల్ గా నిలిచింది సాక్ష్యం ట్రయిలర్. నిన్న రిలీజైన ఈ ట్రయిలర్ లో భారీతనం, హీరోయిజంతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ట్రయిలర్ లో ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కొత్తదనం కూడా కనిపిస్తోంది. సాక్ష్యం స్టోరీలైన్ పై టీజర్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్.. ట్రయిలర్ లో ఆ సస్పెన్స్ ను డబుల్ చేశారు. సినిమా కథపై చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ట్రయిలర్ కట్ చేయడం అంచనాల్ని అమాంతం పెంచేసింది.

మరీ ముఖ్యంగా పంచభూతాలు పగతీర్చుకోవడం అనే కాన్సెప్ట్ కు భారీతనం యాడ్ చేసి చూపించిన విజువల్స్ ట్రయిలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ట్రయిలర్ చివర్లో వృషభంపై హీరో స్వారీ చేస్తూ రావడం అనేది పీక్స్.

ఖర్చుకు వెనకాడకుండా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. శ్రీవాస్ డైరక్ట్ చేసిన ఈ కంప్లీట్ కమర్షియల్ సినిమా జులై 27న థియేటర్లలోకి రానుంది.