సాహో 4 రోజుల వసూళ్లు

Tuesday,September 03,2019 - 12:14 by Z_CLU

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా సక్సెస్ ఫుల్ గా 4 రోజులు కంప్లీట్ చేసుకుంది. వినాయక చవితి ఫెస్టివల్ కూడా కలిసిరావడంతో ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. నార్త్ లో 93 కోట్ల 18 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

విడుదలైన రోజు నుంచి నిన్నటివరకు వసూళ్ల పరంగా ఎక్కడా తగ్గలేదు సాహో సినిమా. నైజాం, నెల్లూరులో బాహుబలి-2ను బీట్ చేయడంతో పాటు.. మిగతా అన్ని ఏరియాస్ లో నాన్-బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది. సాహో దెబ్బకు ఇప్పటివరకు మిగతా హీరోల పేరిట ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

ఇక్కడ నైజాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విడుదలైన మొదటి రోజే బాహుబలి-2 రికార్డును బద్దలుకొట్టిన సాహో.. ఆ రోజు నుంచి నిన్నటివరకు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ వస్తోంది. ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

ఏపీ, నైజాం 4 రోజుల షేర్
నైజాం – రూ. 23.30 కోట్లు
సీడెడ్ – రూ 9.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 7.87 కోట్లు
ఈస్ట్ – రూ. 6.30 కోట్లు
వెస్ట్ – రూ. 4.90 కోట్లు
గుంటూరు – రూ. 7.09 కోట్లు
నెల్లూరు – రూ. 3.58 కోట్లు
కృష్ణా – రూ. 4.50 కోట్లు