సాహో 5 రోజుల కలెక్షన్

Wednesday,September 04,2019 - 03:56 by Z_CLU

భారీ బడ్జెట్ మూవీ సాహో నిన్నటితో 5 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఓవరాల్ గా 55 శాతం రికవర్ అయింది సాహో మూవీ.

నైజాంలో సాహో డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఇప్పటికే బాహుబలి-2 రికార్డును క్రాస్ చేసిన ఈ మూవీ తాజాగా ఒక్క నైజాం నుంచే పాతిక కోట్ల షేర్ రాబట్టింది. దాదాపు ఈ వీకెండ్ వరకు నైజాంలో సాహో హవా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో మరో క్రేజీ మూవీ లేకపోవడం ఇక్కడ ప్లస్ అయింది.

అటు ఓవర్సీస్ లో కూడా సాహో హవా నడుస్తోంది. ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైన ఈ సినిమా, తాజాగా 3మిలియన్ క్లబ్ లోకి దూసుకుపోతోంది. మంగళవారం నాటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు ఓవర్సీస్ లో 27 లక్షల 72 వేల డాలర్లు వచ్చాయి.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 25 కోట్లు
సీడెడ్ – రూ. 10.20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.38 కోట్లు
ఈస్ట్ – రూ. 6.65 కోట్లు
వెస్ట్ – రూ. 5.02 కోట్లు
గుంటూరు – రూ. 7.31 కోట్లు
నెల్లూరు – రూ. 3.74 కోట్లు
కృష్ణా – రూ. 4.64 కోట్లు