రూ. 400 కోట్ల క్లబ్ లో చేరిన సాహో

Monday,September 09,2019 - 01:21 by Z_CLU

నిన్నటితో 10 రోజుల రన్ పూర్తిచేసుకున్న సాహో సినిమా వరల్డ్ వైడ్ 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. వసూళ్ల పరంగా బాహుబలి, బాహుబలి-2 సినిమాల తర్వాత ప్రభాస్ సాధించిన భారీ విజయం ఇది.

ఇక నార్త్ లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రివ్యూస్ కు భిన్నంగా ఈ సినిమా, విడుదలైన అన్ని సెంటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే నార్త్ లో సాహో హిందీ వెర్షన్ వంద కోట్ల మార్క్ అందుకుంది. వీకెండ్ వసూళ్లతో కలుపుకొని ఇది 112 కోట్ల రూపాయలకు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. శని, ఆదివారాలు ఈ సినిమాకు కాస్త వసూళ్లు పెరిగాయి. అయితే ఏపీ, నైజాంలో ఇది బ్రేక్-ఈవెన్ అవుతుందా అవ్వదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 120 కోట్లకు అమ్మారు.

ఏపీ, నైజాం 10 రోజుల షేర్
నైజాం – రూ. 27.36 కోట్లు
సీడెడ్ – రూ. 11.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.58 కోట్లు
ఈస్ట్ – రూ. 7.14 కోట్లు
వెస్ట్ – రూ. 5.40 కోట్లు
గుంటూరు – రూ. 7.75 కోట్లు
నెల్లూరు – రూ. 4.13 కోట్లు
కృష్ణా – రూ. 4.93 కోట్లు