RRR Teaser - రిలీజ్ డేట్ ఫిక్స్?

Thursday,December 31,2020 - 04:39 by Z_CLU

NTR , Ram Charan లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ RRR స్పెషల్ టీజర్ రెడీ అవుతుంది. ఇప్పటి వరకూ చరణ్ , తారక్ ల టీజర్స్ రిలీజ్ చేసిన జక్కన్న జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో టీజర్ రిలీజ్ చేయబోతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల సన్నివేశాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని తెలుస్తుంది.

RRR కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితంలో జరిగిన ముఖ్య ఘటన ఆదరంగా ఫిక్షన్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అమర వీరులను గుర్తుచేస్తూ టీజర్ రిలీజ్ చేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేయనున్నారట.

మరి ఈ టీజర్ సోషల్ మీడియాలో ఎంతటి హంగామా క్రియేట్ చేస్తుందో సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొల్పుతుందో చూడాలి.