Krack - కాస్త ముందే వచ్చేస్తుందా?

Thursday,December 31,2020 - 04:34 by Z_CLU

సంక్రాంతి పోటీలో ఈసారి రవితేజ Krack నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 14న సినిమా థియేటర్స్ లోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించగా తాజాగా సినిమాను ఇంకాస్త ముందే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. జనవరి 14న రామ్ Red రిలీజ్ అవుతుంది. ఒకే రోజు రెండు సినిమాలు అంటే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ‘క్రాక్’ ను జనవరి 9న విడుదల చేయబోతున్నారని సమాచారం.

రేపు అఫీషియల్ గా ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. మరి ముందుగా అనుకున్న జనవరి 14 కే సినిమాను రిలీజ్ చేస్తారా ? లేదా జనవరి 9 షిఫ్ట్ అవుతున్నట్లు తెలియజేస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది.

ఏదేమైనా క్రాక్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ వరకూ ఎదురుచూడాల్సిందే. ఈ సినిమాతో మాస్ మహారాజ రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.