మరో హిట్ పై కన్నేసిన రితికా సింగ్

Thursday,April 13,2017 - 12:15 by Z_CLU

గురు మూవీతో ఇప్పటికే టాలీవుడ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయింది రితికా సింగ్. వెంకీ హీరోగా నటించిన ఆ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది రితిక. గురు సినిమాతో ఈమెకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. గురులో మాస్ క్యారెక్టర్ లో నటించిన రితికా సింగ్, ఇప్పుడు క్లాసీ క్యారెక్టర్ తో మెప్పించడానికి రెడీ అవుతోంది. అదే శివలింగ మూవీ.

లాారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో రితికా సింగ్ మోడ్రన్ అమ్మాయిగా నటించింది. గురు సినిమాకు శివలింగలో రితిక పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. గురులో బాక్సింగ్ చేసిన ఈ బ్యూటీ.. శివలింగ్ లో గ్లామరస్ గా కనిపించింది. అంతేకాదు.. లారెన్స్ తో కలిసి డాన్స్ కూడా చేసింది. సో.. శివలింగ సినిమాతో రితికా సింగ్ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయిందన్నమాట. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది రితికా సింగ్.

పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన శివలింగ సినిమా రేపు థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.