రన్ టైమ్ పై రాజమౌళి రియాక్షన్

Thursday,April 13,2017 - 11:22 by Z_CLU

బాహుబలి-2 రన్ టైం లాక్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంది. అంటే 170 నిమిషాలన్నమాట. ఈ షార్ట్ ఫిలిమ్స్ కాలంలో ఇంత పెద్ద సినిమాని చూసినప్పుడు ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారేమో అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. దీనిపై కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఫైనల్ గా వీటన్నింటిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

బాహుబలి-2 ఐమ్యాక్స్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జక్కన్న… బాహుబలి-2 రన్ టైం పై స్పందించాడు. సినిమా నిడివి 170 నిమిషాలు ఉందనే విషయాన్ని అంగీకరించిన రాజమౌళి… డ్యూరేషన్ తగ్గించేందుకు ఇష్టపడలేదు. పార్ట్-2లో ఉన్న ఎమోషనల్ కంటెంట్, వార్ సీన్స్ తో ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని.. ఏమాత్రం బోర్ కొట్టించే ఆస్కాారం లేదని రాజమౌళి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. నెక్ట్స్ వీక్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవుతాాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానున్న తెలుగు సినిమాగా బాహుబలి – ది కంక్లూజన్ మూవీ చరిత్ర సృష్టించబోతోంది.