'మజిలీ' ట్రైలర్ రివ్యూ

Monday,April 01,2019 - 02:19 by Z_CLU

పెళ్లి తర్వాత నాగ చైతన్య -సమంత జంటగా నటిస్తున్న ‘మజిలీ’ ట్రైలర్ రిలీజయింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి రెండు నిమిషాల పదకొండు సెకన్ల ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేసారు.

నాగ చైతన్య ఇంట్లో ఓ సోఫాలో దిగులుగా పడుకొని వ్యాక్ మెన్ లో పాట వింటూ వచ్చే సన్నివేశంతో మొదలైన ట్రైలర్ ‘డైవర్స్ మాత్రం అడగకండి’ అంటూ వచ్చే డైలాగ్ తో  వర్షంలో సమంత ఏడుస్తూ నడిచే షాట్ తో ఎండ్ అయింది. సినిమాలో పూర్ణ – శ్రావణి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి..? భార్య భర్తలుగా వారి జీవితం ఎలా సాగుతుంది.. అనే అంశాలతో వచ్చే సన్నివేశాలతో ట్రైలర్ ని కట్ చేసారు. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన పూర్ణ బాధను ట్రైలర్ లో హైలైట్ చేసారు. ‘మీరు ఆడి కళ్ళలో కోపాన్ని చూస్తున్నారు.నేను ఆడి గుండెల్లో బాధను చూస్తున్నా’ అంటూ సుబ్బరాజు చెప్పే డైలాగ్ తో పాటు ‘మీరు తను మందు మానేస్తే బాగుండనుకుంటున్నారు. కానీ నేను తన మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుందని కోరుకుంటున్నాను’ అంటూ సమంత చెప్పే డైలాగ్ పూర్ణ మనసుకి  తగిలిన గాయం తాలుకు ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్ పై క్యూరియాసిటీ ని రైజ్ చేస్తున్నాయి.

‘సిగ్గుండాలి రా పెళ్ళాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి తినే తిండి , కట్టుకునే బట్ట ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే’ అంటూ నాగ చైతన్య ని ఉద్దేశించి ఎదురుగా కూర్చొని రావు రమేష్ ఫోన్ లో మాట్లాడే సీన్ , ‘పెళ్ళాం సంపాదన మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ సమంతతో చైతూ చెప్పే ఎమోషనల్ డైలాగ్ పూర్ణ భార్య సంపాదన మీద బ్రతికే క్యారెక్టర్ అని తెలియజేస్తున్నాయి. ట్రైలర్ లో ఈ అంశాలు పూర్ణ క్యారెక్టర్ ని బాగా ఎలివేట్ చేసాయి.  ‘మనం లవ్ లెటర్ మీద రాసుకున్న అమ్మాయి పేరు వెడ్డింగ్ కార్డు మీద ఉండదురా’ అంటూ చైతూ ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా నిలిచింది. అలాగే సినిమాటోగ్రఫీ , గోపి సుందర్ మ్యూజిక్ కూడా ఎట్రాక్ట్ చేసాయి.

ఈ సినిమాతో చైతూకి నటనలో బెస్ట్ అనిపించుకునే స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికిందని అర్థం అవుతుంది. ట్రైలర్ లో కొన్ని సన్నివేశాల్లో చైతూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

చైతూ- దివ్యాన్ష కౌశిక్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ట్రైలర్ లో మరో హైలైట్. ఇక ‘నిన్ను కోరి’తో ముగ్గురి మధ్య జరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీని ఎమోషనల్ గా చూపించిన దర్శకుడు శివ నిర్వాన ‘మజిలీ’ తో పూర్ణ అనే వ్యక్తి తాలూకు లవ్ స్టోరీని ప్రేమ విఫలమయ్యాక అతని జీవితాన్ని చాలా ఎమోషనల్ గా చూపించనున్నాడని అనిపిస్తుంది.

షైన్ స్క్రీన్ బ్యానర్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ‘మజిలీ’ ఏప్రిల్ 5 న థియేటర్స్ లోకి రానుంది.