రిలీజ్ డేట్ ఫిక్సయింది

Wednesday,April 12,2017 - 04:45 by Z_CLU

వేడుక చూద్దాం రారండోయ్ థియేటర్స్ లోకి రావడానికి డేట్ అండ్ టైం ఫిక్సయింది. నిన్న షూటింగ్ ప్రాసెస్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్ అప్పుడే ఎడిటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది. రేపో మాపో DSP ఈ సినిమా రీ రికార్డింగ్ కూడా బిగిన్ చేయబోతున్నాడు.

అటు యాక్షన్ మూవీస్ ని ఇటు రొమాంటిక్ మూవీస్ ని చేస్తూ బ్యాలన్స్డ్ గా కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నాగ చైతన్య, తన కరియర్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ క్యాటగిరీస్ లో ఉండిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైన్ ని మే 19 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.