మహేష్ 'స్పైడర్' ఫస్ట్ లుక్

Wednesday,April 12,2017 - 05:09 by Z_CLU

మహేష్ బాబు మురుగదాస్ సినిమా ‘స్పైడర్’ ఫస్ట్ లుక్ రిలీజయింది. మొత్తానికి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ చూస్తున్న ఎదురుచూపులకు తన స్టైలిష్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది మురుగదాస్ అండ్ టీమ్. ఒకేసారి రెండు ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్ ఫ్యాన్స్ లో ఫుల్లీ లోడెడ్ జోష్ ని నింపేసింది.

 

మహేష్ బాబు ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రిలీజైన రెండు ఫస్ట్ లుక్స్ లో స్టైలిష్ ఫార్మల్స్ లో మెస్మరైజ్ చేస్తున్న మహేష్ బాబు, మరో ఫస్ట్ లుక్ లో తన బ్రాండ్ లుక్ టీషర్ట్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ అవుతుంది.